Offline Gmail: ఆఫ్‌లైన్ మోడ్‌లో జీమెయిల్!

by Manoj |   ( Updated:2022-06-30 09:30:38.0  )
Gmail Introduces Offline Gmail Without Internet
X

దిశ, ఫీచర్స్ : Gmail Introduces Offline Gmail Using Without Internet| ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెయిలింగ్ సేవల్లో జీ-మెయిల్ ఒకటి. 1.8 బిలియన్‌కు పైగా యూజర్లు.. పర్సనల్ కరస్పాండెన్స్ కోసం ఈ సర్వీస్ ఉపయోగిస్తుండగా, వారిలో 75 శాతం మంది తమ మొబైల్ పరికరాల్లోనే యాక్సెస్ చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో యూజర్లకు సాయపడేందుకు ఆఫ్‌లైన్‌ మోడ్‌లో కూడా జీమెయిల్ వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ మేరకు జీమెయిల్‌కు కొత్త లేఅవుట్‌ ఇంట్రడ్యూస్ చేసినట్లు వెల్లడించింది. కాగా ఇది మంగళవారం నుంచే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

జీమెయిల్ కొత్త లేఅవుట్ మీట్, చాట్, జీమెయిల్ వంటి మల్టిపుల్ గూగుల్ కమ్యూనికేషన్ సేవలను ఏకీకృత ఇంటర్‌ఫేస్‌లో అందిస్తోంది. Gmail యూజర్లందరూ డిఫాల్ట్‌గా కొత్త లేఅవుట్‌కు షిఫ్ట్ చేయబడతారు. ఒకవేళ పాత లేఅవుట్‌‌లోనే ఉండాలనుకుంటే వారికి సెట్టింగ్స్ మెనూలో ఆప్ట్-అవుట్ ఆప్షన్ ఉంటుంది. ఇక 'జీమెయిల్ ఆఫ్‌లైన్ మోడ్' విషయానికొస్తే.. యూజర్లు ఇకపై యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మెయిల్స్ చదవగలరని, రిప్లయ్ ఇవ్వడంతో పాటు సెర్చ్ కూడా చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. తక్కువ కనెక్టివిటీ లేదా ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని యూజర్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయండి ఇలా :

వాస్తవానికి క్రోమ్‌లో మాత్రమే ఆఫ్‌లైన్ మోడ్ అందుబాటులో ఉంటుందే తప్ప 'ఇన్‌కాగ్నిటో మోడ్‌'లో ఉండదని గూగుల్ వెల్లడించింది.

* మొదటగా క్రోమ్ నుంచి జీమెయిల్‌కి వెళ్లాలి

* లాగిన్ అయిన తర్వాత సెట్టింగ్స్‌ ఐకాన్ క్లిక్ చేయాలి

* తర్వాత 'సీ ఆల్ సెట్టింగ్స్' పై క్లిక్ చేయాలి

* ఈ పేజీలో ఆఫ్‌లైన్ మోడ్‌ను ఆన్ చేసేందుకు కింది వరుసలో కనిపించే 'ఆఫ్‌లైన్'‌ను ఎంచుకోవాలి.

* ఇప్పుడు 'ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్‌' చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయాలి.

* మీరు Gmailతో ఎన్ని రోజుల పాటు సింక్ చేయాలని కోరుకుంటున్నారో ఎంచుకోవచ్చు.

* సమయ వ్యవధిని ఎంచుకున్న తర్వాత, దిగువన అందుబాటులో ఉన్న 'సేవ్ చేంజెస్' బటన్‌పై క్లిక్ చేయాలి

ఈ ఫీచర్ ఇప్పటికే వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది, కాబట్టి మీరు దీన్ని వెంటనే యాక్టివేట్ చేసుకోవచ్చు.



Advertisement

Next Story

Most Viewed