ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయో తెలుసా..?

by Mahesh |
ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. దేశంలోని పలు ముఖ్య రాష్ట్రాల్లో కరోనా ఉధృతంగా పెరుగుతుంది. ముఖ్యంగా విదేశీయుల తాకిడి ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తూ.. నాలుగో వేవ్ ఆనవాళ్లను చూపెడుతున్నది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ గరిష్టంగా 28,571 యాక్టివ్ కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (21,159), తమిళనాడు (18,842), మహారాష్ట్ర (18,672), కర్ణాటక (6,693), తెలంగాణ (5,189), గుజరాత్ (4,046), ఒడిశా (2,504), ఉత్తరప్రదేశ్ (2,265), ఢిల్లీ ( 2,264). వరుసగా ఉన్నాయి. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,28,690 కి చేరుకుంది.

Advertisement

Next Story