అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో డిజిటల్ లాకర్ సిస్టమ్‌

by Mahesh |
అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో డిజిటల్ లాకర్ సిస్టమ్‌
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం అన్ని కాలేజీలు.. విశ్వవిద్యాలయాలు.. విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల సర్టిఫికెట్లు, ఇతన పత్రాలు కావాలంటే కచ్చితంగా.. కాలేజీకి లేదా యూనివర్సీటికి వెళ్లాల్సిందే.. అలా జరగకుండా ఉండటానికి విద్యార్థులకు డిజిటల్‌గా మార్కులు, సర్టిఫికేట్లు, మైగ్రేషన్, ఇతర పత్రాలు అందించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ లాకర్ వ్యవస్థను ప్రవేశ పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందుకు గాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో అన్ని ప్రధాన కళాశాలలు, యూనివర్సిటీల్లో, ఈ డిజిటల్ లాకర్ వ్యవస్థను దశల వారీగా అందుబాటులోకి తీసుకరావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అందుకు గాను మొదటి దశలో మార్కుల షీట్లను అందుబాటులో ఉంచుతామని విద్యాధికారి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed