గ్రహాలపై వజ్రాల వర్షం.. తీసుకోవడం సాధ్యమేనా?

by Nagaya |
గ్రహాలపై వజ్రాల వర్షం.. తీసుకోవడం సాధ్యమేనా?
X

దిశ, ఫీచర్స్ : భూగ్రహంపై వర్షం.. నీటి(హైడ్రోజన్, ఆక్సిజన్) బిందువుల రూపంలో కురుస్తుందని తెలిసిందే. కానీ కొన్ని గ్రహాల్లో మాత్రం ఈ బిందువులు భారీ సైజులో, మందంగా ఉండటంతో పాటు నీటికి బదులు కార్బన్‌ సమ్మేళనంగా ఉంటాయి. పైగా ఈ గ్రహాలపై ఉష్ణోగ్రత, పీడన పరిస్థితులు తీవ్రం కాగా.. అందుకే ఆయా వాతావరణాల్లో వర్షం కురుస్తున్నప్పుడు కార్బన్ అణువులు వజ్రాలుగా చూర్ణం చేయబడతాయి. ఆ గ్రహాలే భూమికి దగ్గరగా మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి 'యురేనస్, నెప్ట్యూన్'.

వజ్రాల వర్షం ఎందుకు పడుతోంది?

యురేనస్, నెప్ట్యూన్ వాటి ప్రత్యేక బ్లూ షేడ్స్ ద్వారా వర్గీకరించబడతాయి. అవి ఒకే విధంగా కనిపించినప్పటికీ లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. ఈ గ్రహాలపై ఇలాంటి ప్రత్యేక స్థితికి నీలి రంగే ప్రధాన కారణం. మీథేన్ ఫలితంగానే ఇవి ఈ రంగులో కనిపిస్తాయి. మీథేన్.. పొగమంచు కణాలపై చాలా వేగంగా ఘనీభవించడం వల్ల ఈ పొర బేస్ వద్ద 'మంచు'గా మారుతుంది. ఉష్ణోగ్రతల స్థాయిలు పడిపోయినపుడు ఇక్కడ ఆవిరైపోయిన మీథేన్ ప్రధాన పొగమంచు కణాలను విడుదల చేస్తుంది. కాగా మీథేన్‌లో కార్బన్ ఉంటుందని, ఏ ప్రమేయం లేకుండా స్వయంగా ఏర్పడే ఈ కార్బన్ అపారమైన ఒత్తిళ్ల వల్ల నలిగిపోతుందని నవోమీ గర్నీ అనే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త వెల్లడించారు. గ్రహం లోపల వేడి, సాంద్రత దట్టంగా ఉన్నప్పుడు ఈ వజ్రాలు ఏర్పడి పేరుకుపోతాయి. ఆపై మరింత భారీగా మారి, అవే వాతావరణంలో వర్షంగా కురుస్తాయని చెప్పారు.

ఇక్కడ నెప్ట్యూన్ స్పష్టంగా నీలి రంగు కలిగి ఉండగా.. యురేనస్ లేత నీలం రంగులో ఉంటుంది. ఈ రెండు గ్రహాల్లోని తీవ్ర పరిస్థితులు వల్ల కార్బన్ పరమాణువులు గట్టిపడి వజ్రాలుగా ఏర్పడతాయి. దురదృష్టవశాత్తు ఈ వజ్రాలను సేకరించడానికి ఆ గ్రహాలపైకి వెళ్లలేము.

Advertisement

Next Story

Most Viewed