- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధోనీపై బ్రావో హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ అంటే తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండడు. ఐపీఎల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే జట్టుల్లో సీఎస్‌కే టాప్‌లో ఉంటుంది. అందులోనూ ధోనీ అంటే అభిమానించని ప్రేక్షకుడూ ఉండడనే చెప్పుకోవాలి. విదేశీ ఆటగాళ్లలో సైతం ధోనీ అభిమానులు ఉన్నారు. అటువంటి ధోనీ సారథ్యంలో ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్స్‌లో చెన్నై మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకుంది. చెన్నైతో మ్యాచ్ అంటే అది లీగ్ ఫస్ట్ మ్యాచ్ అయినా లాస్ట్ మ్యాచ్ అయినా ఒకేలా ఉంటాయి.
చెన్నై మైదానంలో ఉందంటే ప్రేక్షకుడు సీట్ అంచుల్లో కూర్చోవడం పక్కా. అంతేకాకుండా ఇతర జట్లు సైతం చెన్నైతో మ్యాచ్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఎలాగైనా గెలవాలన్న కసితో ఆడతాయి. అయితే తాజాగా చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తన ఫ్రాంచైజీ సక్సెస్ గురించి హాట్ కామెంట్స్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సక్సెస్‌కు తమ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు.
'ధోనీ కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. అతడు ఇంకా ఆడుతూ ఉండటం చాలా ఆనందంగా ఉంది' అని అన్నాడు. అంతేకాకుండా చెన్నై టీమ్‌కు ధోనీ నాలుగు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. ధోని గురువారం కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆల్‌రౌండర్ రవింద్ర జడేజా జట్టు సారథ్యం అందుకున్నాడని చెప్పుకొచ్చాడు.