Dasoju Sravan Kumar: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. దాసోజు శ్రవణ్ రాజీనామా!

by GSrikanth |   ( Updated:2022-08-05 09:33:24.0  )
Dasoju Sravan Kumar is set to quit Congress Party
X

దిశ, వెబ్‌డెస్క్: Dasoju Sravan Kumar is set to quit Congress Party| తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో సీటు రాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇటీవలే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం, వెంకట్ రెడ్డి తరచూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుండటం జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌ శ్రేణులకు దాసోజు శ్రవణ్ రాజీనామా వార్త రూపంలో మరో షాక్ తగిలింది. దీనిపై పార్టీ అగ్రనేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రాజగోపాల్ రెడ్డి చేరిక అనంతరం దాసోజు కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Telangana Congress లో మరో కలకలం.. అతడి చేరికతో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!

Next Story

Most Viewed