పాక్ వెన్నులో మొదలైన వణుకు.. ‘ఆక్రమణ్’ పేరుతో ఐఏఎఫ్ విన్యాసాలు

by Shiva |   ( Updated:2025-04-25 13:13:37.0  )
పాక్ వెన్నులో మొదలైన వణుకు.. ‘ఆక్రమణ్’ పేరుతో ఐఏఎఫ్ విన్యాసాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం (Pahalgam) టెర్రర్ ఎటాక్‌తో భారత్‌ (India), పాకిస్థాన్‌ (Pakistan) సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి హద్దులు మీరి ప్రవర్తిస్తోంది. ఎల్ఓ‌సీ వెంట ఉన్న భారత పోస్టులపై కాల్పుల మోత మోగిస్తోంది. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ (BSF)దళాలు కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో నలుగురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని బందిపొరా (Bandipora)లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ (Search Operation) కొనసాగుతోంది.

‘ఆక్రమణ్’ పేరుతో ఐఏఎఫ్ విన్యాసాలు

ప్రత్యర్థి పాకిస్థాన్‌ (Pakistan)పై ఎలాంటి దాడికైనా భారత్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ సెక్టార్‌ (Central Sector)లో అగ్రశ్రేణి పైలట్లు డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ‘ఆక్రమణ్’ (Akraman) పేరుతో సరిహద్దులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian Air Force) విన్యాసాలు చేస్తోంది. అందులో రఫేల్ (Raphael), సుఖోయ్ (Sukhoi) లాంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అవి పర్వతాలు, మైదాన ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాలు చేస్తోన్న దాయాది సైన్యం వెన్నులో వణుకు పుడుతోంది. దీంతో పాక్‌లోని కమ్రా ఎయిర్ బేస్‌ (Kamra Air Base)లో విమానాలను టేకాఫ్ ల్యాండింగ్‌ ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు. భారత్ ఏ క్షణమైనా తమపై దాడులు చేయవచ్చనే భయం పాక్‌ను వెంటాడుతోంది.

పారా మిలటరీ బలగాలకు సెలవులు రద్దు

భారత్, పాక్ సరిహద్దుల ఉద్రిక్తత నెలకొన్న వేళ పారా మిలిటరీ బలగాలకు సెలవులను పూర్తిగా రద్దు చేశారు. జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir) పరిస్థితులపై త్రివిధ దళాలతో కేంద్ర హోంశాఖతో పాటు రక్షణ శాఖ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే లీవ్‌లపై వెళ్లిన సైనికులు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.



Next Story

Most Viewed