- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Pak: ఉద్రిక్తతల వేళ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో పాక్ మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి భారతసైనిక స్థావరాలపై పాక్ కాల్పులకు పాల్పడింది. దాయాది దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది. శత్రువుల కాల్పులకు దీటుగా బదులిస్తోంది. అయితే, అర్ధరాత్రి నుంచే కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, బందిపొరాలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ జిల్లాలోని కుల్నార్ బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. జవాన్లను చూసిన ముష్కరులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఉగ్రదాడి
పెహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు భయానక దాడికి పాల్పడ్డారు. అందులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, భారత్, పాక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో పాక్ అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.