- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేటి నుంచి 12–14 వయస్సు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్
by Vinod kumar |

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: నేటి నుంచి 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలకు కొవిడ్–19 వ్యాక్సిన్వేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్య లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 2010 మార్చి 15 కంటే ముందు జన్మించిన పిల్లలే వ్యాక్సిన్వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యాశాఖలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
శిక్షణ పొందిన వైద్య సిబ్బందితోనే వ్యాక్సిన్ వేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తం రంగారెడ్డి జిల్లా కలెక్టర్అమోయ్కుమార్పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్ విజయవంతంచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Next Story