ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సీఎంలు, మాజీ సీఎంలు

by Harish |
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సీఎంలు, మాజీ సీఎంలు
X

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. అయితే, కనీవినీ ఎరుగని విధంగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఘోర ఓటమి చవిచూశారు. ముందుగా పంజాబ్ విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అదే విధంగా మాజీ సీఎంలు అమరీందర్ సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా ఓటమి పాలయ్యారు. ఇకపోతే ఉత్తరాఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా 6 వేల ఓట్లతో ఘోర ఓటమిని చవిచూశారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, గోవా మాజీ సీఎం లక్ష్మీకాంత్ పార్సేకర్ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.


Advertisement

Next Story