- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ కీలక నిర్ణయం.. బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు
దిశ, ఏపీ బ్యూరో : 'దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మన మధ్య లేడనే వార్త చాలా కష్టంగా ఉంది. ఆయన ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి గౌతమ్ నాకు మంచి స్నేహితుడు. ప్రతీ అడుగులో నాకు తోడుగా ఉన్నాడు. గౌతమ్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిది. రాజకీయాల్లోని గౌతమ్ రెడ్డిని నేను తీసుకు వచ్చాను. రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ గౌతమ్ రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంది. గౌతమ్ రెడ్డి ఏపీ మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను నిర‍్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారు.
గౌతమ్ రెడ్డి ప్రతీ అంశంలోనూ నన్ను ప్రోత్సహించారు. మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేసి.. గౌతమ్ రెడ్డి గౌరవార్ధం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతాం' అని సీఎం వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి వెల్లడించారు. వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు.