CM Jagan: మహా అగ్నికణం అల్లూరి.. ఏపీ సీఎం జగన్​

by Nagaya |
CM Jagan Participated In Alluri Sitarama Raju Birthday Celebrations
X

దిశ, డైనమిక్​ బ్యూరో : CM Jagan Participated In Alluri Sitarama Raju Birthday Celebrations| మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు అని ఏపీ సీఎం జగన్​ కొనియాడారు. ఎందరో మహానుభావుల త్యాగఫలితమే నేటి భారతదేశమన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని ఎందరో స్వాతంత్రయోదులు ప్రాణాలను అర్పించారు. నేడు వారి పేర్లును స్మరించుకుంటూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. తెలుగుజాతికి భారతదేశానికి గొప్ప స్ఫూర్తి అల్లూరి. ఆయన నడిచిన నేలకు అల్లూరి జిల్లాగా పేరు పెట్టుకున్నాం. అల్లూరి చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందని జగన్ అన్నారు. బీమవరంలో ప్రధాని చేతుల మీదుగా అల్లూరి విగ్రహ అవిష్కరణ జరగడం సంతోషంగా ఉందని జగన్​ అన్నారు. నేడు బీమవరాని వచ్చిన ప్రధాని మోదీకి, గవర్నర్​ విశ్వభూషణ్​​ హరిందర్​, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డికి సీఎం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed