- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బిల్డింగ్ కూల్చివేతతో టీఆర్ఎస్, అఖిలపక్ష నేతల మధ్య తోపులాట
దిశ, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో నిర్మించే పాఠశాల భవనం విషయంలో సోమవారం టీఆర్ఎస్, అఖిలపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఏంజెఆర్ ట్రస్ట్ ద్వారా మండల కేంద్రంలో నూతన పాఠశాలను నిర్మించేందుకు నిర్ణయించారు. కానీ గతంలోనే పాఠశాల స్థలం కోసం గ్రామ పంచాయతీ తీర్మానించిన స్థలంలో కాకుండా కొత్తగా ఉన్న పాఠశాలను కూల్చడంపై అఖిలపక్ష నేతలు నిరసన తెలిపారు. గత నెలరోజుల కింద స్థానిక అఖిలపక్ష నేతలంతా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళాను. కానీ అది పట్టించుకోకుండా ఎమ్మెల్యే అనుచరులు ఏకపక్షంగా జేసీబీతో అందరూ చూస్తుండగానే పాఠశాలను కూల్చడంపై ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి అఖిలపక్ష నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతలోనే టీఆర్ఎస్ నేతలు పాఠశాల కూల్చడం అందరినీ విస్మయానికి గురి చేసిందని అఖిలపక్షం నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నూతన పాఠశాల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని నూతన పాఠశాల కోసం గతంలోనే గ్రామ పంచాయతీ తీర్మానించి విశాలమైన రెండెకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. కానీ ఆ స్థలంలో కాకుండా ఇక్కడ నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.