- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సిరిసిల్ల కాంగ్రెస్ మీటింగ్‌లో మరోసారి బయటపడిన వర్గ విభేదాలు

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల కాంగ్రెస్ మీటింగ్ నేతల మధ్య కుమ్ములాటకు దారి తీసింది. దీంతో స్థానిక నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిల్లా పరిశీలకుని ఎదుటే కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగడంతో సమావేశం గందరగోళంగా మారింది. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా, సమావేశంలో పీసీసీ మాజీ సీనియర్ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు మాట్లాడుతుండగా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. అధికారం వచ్చి ఏడాదిన్నర కాలం గడిచిన కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇవ్వడం లేదని ఉమేష్ రావు చేసిన వ్యాఖ్యలపై కార్యకర్తలు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేదికపైకి దూసుకురావడంతో సమావేశం పూర్తిగా గందరగోళంగా మారింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలగజేసుకొని కాంగ్రెస్ నేతలను నచ్చజెప్పి గొడవ సద్దుమణిగించారు. కాగా జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో జరిగిన రగడ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.