- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘కిష్కింధ పురి’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సాయి శ్రీనివాస్(Sai Srinivas) చివరగా చత్రపతి సినిమాలో నటించారు. ఇక ఆ తర్వాత రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సాయి మల్టీ స్టారర్ ‘భైరవం’(Bhairavam) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో పాటు ‘కిష్కింధ పురి’ (Kishkindha Puri)అనే హారర్ సినిమాలోనూ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ డైరెక్టర్ కౌషిక్ పెగల్లపతి( Kaushik Pegallapathi ) తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్, అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, కౌషిక్ పెగల్లపతి నిర్మిస్తున్నారు. అయితే ఇందులో బెల్లకొండ సాయి శ్రీనివాస్ సరసన స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలవగా.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.
ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా, ‘కిష్కింధ పురి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రాబోతున్న మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 29న సాయంత్రం 4: 05 గంటలకు గ్లింప్స్ రాబోతున్నట్లు తెలుపుతూ సాయి పోస్టర్‌ను షేర్ చేశారు. మంటలు మండుతుండగా.. సాయి ఉగ్రరూపంలో కనిపించాడు. ఈ పవర్ ఫుల్ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ హారర్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ ‘భైరవం’షూట్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇది అయిపోయిన తర్వాత ‘కిష్కింధ పురి’ షూట్‌లో జాయిన్ కానున్నారట. మొత్తానికి మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.