సుకుమార్ డైరెక్షన్‌లో చిరు యాక్టింగ్.. ట్వీట్ వైరల్

by Javid Pasha |   ( Updated:2022-04-01 11:19:39.0  )
సుకుమార్ డైరెక్షన్‌లో చిరు యాక్టింగ్.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా : సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సుదీర్ఘ చర్చలు కొనసాగుతుండగా.. ఈ విషయాన్ని స్వయంగా చిరునే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ట్వీట్‌ విషయానికొస్తే.. 'దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికీ తెలిసిందే. వారి దర్శకత్వం‌లో ఓ యాడ్ ఫిల్మ్‌‌లో నటించాను. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. ఈ యాడ్ నిర్మించిన శుభగ్రహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు' అంటూ నోట్ షేర్ చేశాడు మెగాస్టార్. ఇక ఈ ఫొటోల్లో ఫార్మల్ డ్రెస్‌‌లో దర్శనమిచ్చిన చిరు.. మరింత యంగ్ లుక్‌లో అభిమానులను అట్రాక్ట్ చేయడం విశేషం.

Advertisement

Next Story