- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక సావిత్రి బాయి పూలే
దిశ, అల్వాల్: నేటి మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక సావిత్రి బాయి పూలే అని మల్కాజిగిరి సర్కిల్ గౌతం నగర్141 డివిజన్కార్పొరేటర్మేకల సునీత రాము యాదవ్ అన్నారు. గురువారం బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి పూలే 125వ వర్ధంతి సందర్భంగా గౌతం నగర్ చౌరస్తాలోని పూలే సావిత్రి బాయి విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకలకు ముఖ్య అథితిగా హజరై పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం మొదటి మహిళ ఉపాద్యాయురాలు సావిత్రి బాయి పూలే అని ప్రతి మహిళ గుర్తుంచుకోవాలని కోరారు. ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ముందుకు పోతున్నారు అంటే అది సావిత్రి బాయి పూలే ఆనాడు చేసిన సహాసోపేతమైన పోరాటంతోనే సాధ్యమైందన్నారు.
ఈరోజు అన్నివర్గాల మహిళలు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారంటే సావిత్రి బాయి పూలే కృషి వల్లే అన్నారు. ప్రతి యేడు సావిత్రి బాయి పూలే జయంతి, వర్ధంతులు జరుపుకుంటూ ఆమె త్యాగనిరతిని.. వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతి మహిళ అలవర్చుకోవాలని కోరారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు కుమ్మరి రాజు, మొహమ్మద్ రషీద్, డాక్టర్ సుధాకర్, శ్రీనివాస్ చారి, రామకృష్ణ ముదిరాజ్, గజపతి, మల్లేష్ యాదవ్, వెల్డింగ్సత్యనారాయణ, స్థానిక టీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.