- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మున్సిపాలిటీలో అన్ని పోస్టులను భర్తీ చేస్తాం
దిశ, పరిగి: పరిగి మున్సిపాలిటీలో ఉన్న ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని డీసీఎంఏ డైరెక్టర్సత్యనారాయణమూర్తి అన్నారు. వికారాబాద్‌జిల్లా పరిగి మున్సిపల్‌పరిధిలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్బంగా పరిగిలోని 2వ వార్డులో నర్సరీ, మూడవ వార్డులో పార్కును పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పార్కుల గురించి ఎమ్మెల్యే, మున్సిపల్సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించగా సీడీఎంఏ డైరెక్టర్దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే భర్తీ చేస్తామన్నారు. మున్సిపాలిటీకి రావాల్సిన ఎల్ఆర్ఎస్ నిధులు కూడా మంజూరు చేయిస్తామన్నారు. మున్సిపాలిటీలో పన్నుల వసూలు 60 శాతం మాత్రమే చేశారని వెంటనే 100 శాతం వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. పరిగి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి డైరెక్టర్సత్యనారాయమూర్తికి తెలిపారు. ఈ పరిశీలనలో ఎమ్మెల్యేతోపాటు మున్సిపాలిటీ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ముకుంద అశోక్ కుమార్, కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ డీఈ యూనూస్, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, నాగేశ్వర్, నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.