- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
27ఏళ్ల ఉద్యోగి సర్వీస్‌కు 'గూడీ' బ్యాగ్ కానుక.. విమర్శిస్తున్న నెటిజన్లు!
దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది తమ జీవితంలో ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే ఆఫీసులో పని చేసేందుకు ఎక్కువ సమయం గడుపుతాం. ఈ క్రమంలో ప్రతీ ఉద్యోగి కూడా తన పనికి తగ్గ ప్రతిఫలంతో పాటు కాస్త గుర్తింపు కూడా కోరుకుంటాడు. తమ పనికి గౌరవం దక్కితే ఉద్యోగులకు అంతకుమించిన ఆనందం మరోటి ఉండదు. కొన్ని సంస్థలు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నా నూటికి తొంభై కంపెనీలు తమ ఉద్యోగులు అందించిన పనికి తగ్గ గుర్తింపును ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. దీనికి బర్గర్ కింగ్ ఉద్యోగి.. తన 27 సంవత్సరాల సర్వీస్‌కు పొందిన 'ప్రశంస' నిదర్శనం.
ఫాస్ట్ ఫుడ్ చైన్లు ప్రతి భోజనంతో నాణ్యమైన ప్రమాణాలకు మించి టైమ్‌కు డెలివరీ చేస్తాయి. అయితే మీరు ఈ ఫాస్ట్‌ఫుడ్ అవుట్‌లెట్‌ల వెనుకకు వెళితే, ప్రతిసారీ రుచికరమైన ఆహారాన్ని అందించడానికి పగలు, రాత్రి శ్రమించే కొంతమంది కష్టపడి పనిచేసే ఉద్యోగులు కనిపిస్తారు. అయినప్పటికీ ఈ ఉద్యోగులందరికీ వారి ప్రయత్నాలకు అద్భుతమైన ప్రతిఫలం లభించదనడానికి కెవిన్ స్టోరీనే ఉదహరిస్తూ.. ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ చేస్తున్నారు.
లాస్ వెగాస్ విమానాశ్రయంలోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో కుక్ అండ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న కెవిన్.. తన వర్క్-యానివర్సిరీ వేళ అందుకున్న 'గూడీ బ్యాగ్'ని చూపించే వీడియోను పంచుకున్నాడు. చిన్నపాటి ప్లాస్టిక్ సంచిలో నాలుగైదు చిన్న వస్తువులను బహుమతిగా ఇవ్వడం చాలా అగౌరవంగా భావించినట్లుగా అతడు పేర్కొన్నాడు. 27 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా అబ్సెంట్ లేకుండా పనిచేసిన ఉద్యోగికి ఇలాంటి బహుమానం దక్కడం పట్ల నెటిజన్లు కూడా బాధపడుతున్నారు. 'దాదాపు మూడు దశాబ్దాల నీ ఉద్యోగ ప్రయాణానికి మేనేజ్‌మెంట్ ఇచ్చిన ప్రతిఫలం నిజంగా బాధాకరం. ఒక్క ప్రమోషన్ లేకుండా నీవు అందించిన సేవకు హ్యాట్సాఫ్. బర్గర్ కింగ్ సీఈవో కంటే ఆ స్టోర్‌ను ఎలా నడపాలో నీకే ఎక్కువ తెలుసు. సో నువ్వే ఓ కొత్త స్టోర్ ఓపెన్ చేసేయ్' అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Burger King employee trends after video shows that he was gifted a goodie bag for his 27 years of work dedicated to the company pic.twitter.com/MLJiW21yKE
— My Mixtapez (@mymixtapez) June 21, 2022