- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
9 మందిని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు ఒక భార్య అది కావాలంటోంది..?!
దిశ, వెబ్‌డెస్క్ః గతేడాది కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ 'ఫ్రీ లవ్' కాన్సెప్ట్ సూపర్ ఫేమస్ అయ్యింది. ఒకరిద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది మహిళలను పెళ్లాడి నెటిజన్లను ఉర్రూతలూగించాడు. మళ్లీ ఏడాదికి, మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి, అతని భార్యల్లో ఒకరు ఈ బహుభార్యత్వం దారుణంగా ఉందని, తనకు విడాకులు కావాలని అంటుంది. అయితే, ఆమె తీసుకున్న నిర్ణయం తనని చాలా బాధిస్తుందని బ్రెజిల్ బాయ్ తెగ బేజారవుతున్నాడు. అయినా, అందరి సమ్మతితోనే ఒకేసారి పెళ్లి చేసుకున్నామనీ, ఇప్పుడు ఒకరితోనే (మోనోగమి) ఉండాలనడం విచిత్రంగా ఉందని అన్నాడు. అయినా, తాను 10 మంది భార్యలను చేసుకోవలన్నది కల అని, భవిష్యత్తులో మరో ఇద్దర్ని చేసుకొని, 10 మంది భార్యలతో కలిసుంటానని అంటున్నాడు.
"స్వేచ్ఛా ప్రేమ", "ఏకభార్యత్వానికి వ్యతిరేకంగా నిరసన" తెలుపుతూ 2021లో ఆర్థర్ ఓ ఉర్సో అనే ఈ మోడల్ సావో పాలోలోని క్యాథలిక్ చర్చిలో తొమ్మిది మంది వధువులతో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి వాళ్లంతా ఒకే ఇంట్లో ఎంత సామరస్యంగా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నదీ ప్రపంచానికి తెలియడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతున్నాడు. అయితే, ఇప్పుడు అతని జీవిత భాగస్వాములలో ఒకరైన అగాథ అనే భార్య "బహుభార్యత్వంతో" థ్రిల్‌గా లేదని, ఆమె ఒక్కదానికే నేను సొంతం కావాలని అంటుందని.. ఆర్థర్ తెగ బాధపడుతున్నాడు. "నేను విడిపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను, అంతకుమించి, ఆమె చెప్పిన కారణం మరింత ఆశ్చర్యం కలుగజేసింది. మేమంతా సాహసం చేయాలనుకున్నాము కానీ ఇలా సొంత భావాల కోసం జీవింత కూడదని ముందే నిర్ణయించుకున్నాము. కాదని ఆమె ఏకస్వామ్య సంబంధం కావాలనడం బాధగా ఉందని" అన్నాడు.
అయితే, వీరి విడాకుల సంగతి అటుంచి, బ్రెజిల్‌లో బహుభార్యత్వం చట్టవిరుద్ధం కనుక తొమ్మిది మంది మహిళలతో ఉర్సో వివాహం ఇంతవరకూ చట్టబద్ధమే కాలేదు. స్థానికి మీడియా కథనాల ప్రకారం, అగాథ "వైఖరి తప్పు" అని అతని మిగితా 8 మంది భార్యలు అంగీకరించారని అతను పేర్కొన్నాడు. ఇక, ప్రస్తుతం ఒక బిడ్డకు తండ్రిగా ఉన్నా ఆర్థర్, భవిష్యత్తులో తన ప్రతి భార్యతో ఒక్కో బిడ్డ చొప్పున మరింత మంది పిల్లలను కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. "ప్రతి ఒక్కరి పట్ల నాకున్న ప్రేమ ఒక్కటే. వారిలో ఒకరిద్దరికే పిల్లలుండటం అన్యాయమని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.
- Tags
- divorce