- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరికొన్ని గంటల్లో విడుదల.. చిక్కుల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా
దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ 'ఆర్ఆర్ఆర్' రేపే విడుదల కానుంది. ఈ సినిమా ఎట్టకేలకు విడుదలవుతున్న సందర్భంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల వద్ద జాతర్లు జరుగుతాయని అర్థం అవుతోంది. నందమూరి, మెగా అభిమానులకు దాదాపు పూనకాలు రావడం పక్కా. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కర్ణాటక ప్రేక్షకులంగా నెట్టింట 'బాయ్‌కాట్‌ఆర్ఆర్ఆర్' అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఇందుకు కారణం బెంగళూరులో విడుదలవుతున్న అత్యధిక 'ఆర్ఆర్ఆర్' కాపీలు తెలుగు వెర్షన్‌వి కావడమే. దీంతో కన్నడ ప్రేక్షకులంతా తమకు అన్యాయం జరుగుతుందని, డిస్ట్రిబ్యూటర్ల తమకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బాయ్‌కాట్ ఆర్ఆర్ఆర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు తెలుగులో బాయ్‌కాట్ కేజీఎఫ్2 అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఇవి హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనికి మేకర్స్ ఎలా చెక్ చెప్తారో చూడాలి.