- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP CABINET: మంత్రినా, మజాకా.. మంత్రులందరికీ భిన్నంగా వ్యవహరించిన బొత్స
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మంత్రివర్గం కొలువు దీరింది. వెలగపూడిలోని సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రులు అంతా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం సీఎం జగన్ పదాలు మెుక్కి గవర్నర్‌కు నమస్కారం పెట్టారు. వైఎస్ జగన్ కంటే వయసులో పెద్దవాళ్లైన వారు కూడా జగన్ కాళ్లు మెుక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే నా రూటే సెపరేటు అన్నట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహరించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతీ ఒక్కరూ సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకుని గవర్నర్ వద్దకు వెళ్తే మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టిన అనంతరం నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లారు. ఆయనకు నమస్కారం పెట్టారు. ఆ తర్వాతే సీఎం జగన్ వద్దకు వెళ్లారు. మంత్రి బొత్స సత్యనారాయణ కంటే ముందే సీఎం జగన్ ఆయనకు నమస్కారం పెట్టారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ తట్టి వెళ్లి పోయారు. మెుత్తానికి ఈ మంత్రివర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి బొత్స వ్యవహార శైలి కాస్త భిన్నంగా మారింది. దీంతో అంతా బొత్స వ్యవహారంపైనే చర్చించారు. ఏదైనప్పటికీ సినియర్ మంత్రి సీనియర్ మంత్రేనంటూ కొందరు సమర్థిస్తున్నారు.
టెన్షన్ పడ్డ మంత్రులు
ఇకపోతే తొలిసారి కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో చాలా మంది ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు టెన్షన్ పడ్డారు. అది ప్రమాణం చేయడంలో కాదండోయ్ సంతకాలు పెట్టడంలోనో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక కాస్త టెన్షన్ పడ్డారు. ముఖ్యంగా దాడిశెట్టి రాజా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సంతకం పెట్టకుండా జగన్‌ను వద్దకు వెళ్లిపోయారు. అయితే అధికారులు పిలవడంతో మళ్లీ నవ్వుకుంటూ వచ్చి సంతకం పెట్టారు. ఇకపోతే మంత్రి బొత్స సత్యనారాయణ తన జేబులో పెన్నుతో సంతకం చేస్తుండగా అధికారులు తమ వద్ద ఉన్న పెన్ అందించారు. దీంతో ఏ పెన్ తో సంతకం చేయాలో తెలియక చివరకు అధికారులు ఇచ్చిన పెన్‌తోనే సంతకం చేశారు. ఇదిలా ఉంటే ఈ 25మంది మంత్రులలో సీదిరి అప్పలరాజు మాత్రమే గవర్నర్ బీబీ హరిచందన్‌కు పాదాభివందనం చేయడం గమనార్హం.