'పుష్ప' పార్ట్ 2.. ఐటెం సాంగ్‌కు సిద్ధమైన బాలీవుడ్ బ్యూటీ

by Harish |
పుష్ప పార్ట్ 2.. ఐటెం సాంగ్‌కు సిద్ధమైన బాలీవుడ్ బ్యూటీ
X

దిశ, సినిమా : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మేనియా ఇంకా జనాలను వదల్లేదు. అయినా 'పుష్ప 2'ను వీలైనంత త్వరగా ప్రేక్షకులకు అందించే పనిలో బిజీ ఉన్నాడు సుక్కు. ఇక పార్ట్ 1 లో సమంత నటించిన 'ఊ అంటావా' ఐటెం సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ క్రమంలో సెకండ్ పార్ట్‌లోనూ మరో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ 'దిశా పటానీ'ని ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో చర్చలు పూర్తయ్యాయని, 'పుష్ప' రేంజ్ చూసి తను కూడా ఐటమ్ సాంగ్‌‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, పారితోషికం విషయంలో సమంతనే కోటికి పైగా తీసుకుంటే మంచి స్టార్‌డమ్ ఉన్న దిశ ఎంత డిమాండ్ చేస్తుందోనని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement

Next Story