- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి.. బీజేపీ యువ మోర్చ అధ్యక్షుడు పవన్ ముదిరాజ్ డిమాండ్
దిశ, కంది : తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్‌లో భాగంగా అందుకు సన్నద్ధమయ్యే యువతకు నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్‌తో పాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు పవన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ రాధిక రమణికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014 లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఉద్యోగ నియామకాలు జరపని విషయం తెలిసిందేనని, గడిచిన ఏడు సంవత్సరాలుగా ఉద్యోగాల నియామకాల కోసం ఎదురుచూస్తున్న యువతీ , యువకులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు కొంత ఊరటనిస్తున్నాయని అన్నారు. అయితే అందుకోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు పోటీ పరీక్షలు రాయడానికి గ్రూప్ -1 , గ్రూప్ -2 , గ్రూప్ -3 , గ్రూప్ -4 , టీచర్ పోస్టులు , పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు , ఎస్ఐ పోస్టులకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బీజేవైఎం తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
2014 , 2018 లో విడుదల చేసిన టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎస్సీ , ఎస్టీ , బీసీ , ఈబీసీ యువతకోసం ప్రతీ జిల్లాలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారని పవన్ ముదిరాజ్ గుర్తు చేశారు. ఈ హామీ ప్రకారం ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు చెందిన యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. గత రెండేండ్లుగా కోవిడ్ మహమ్మారి సమస్యతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ , యువకులు పోటీ పరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టే పరిస్థితి లేదని, మారుమూల గ్రామాల నుండి శిక్షణ కొరకు జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయప్రయాసలతో కూడిన అంశమని పవన్ ముదిరాజ్ చెప్పారు. వీరికి ప్రభుత్వం వైపు నుండి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా తగిన సహకారం అందుతుందన్నారు. ఇకపోతే ప్రస్తుతం గ్రూపు -1కు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల యజమానులు వసూలు చేస్తున్నారు.
గ్రూపు 2కు 20 వేల నుండి 30 వేల వరకు ఫీజు ఉంది. గ్రూప్ -3 , గ్రూప్ -4 ఉద్యోగాలకు 15 వేల నుంచి 20 వేల వరకు ఫీజు ఉందని తెలిపారు. డీఎస్సీ , టీచర్ రిక్రూట్మెంట్ కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో 15 వేల నుండి 25 వేలు , ఎసై, పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ కొరకు 10 నుండి 20 వేల చొప్పున ప్రైవేటు కోచింగ్ సెంటర్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ బయట రూమ్ తీసుకుని ఉండడానికి రూము అద్దె - భోజనం ఖర్చులు మరో 30 వేల నుండి 40 వేల ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పేద మధ్య తరగతి కుటుంబాలకు కోచింగ్ తీసుకోవడం సాధ్యం కాదని, అందుకు గాను ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించాలని బీజేవైఎం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికొక ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు అదనపు ఖర్చులు తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. కోచింగ్ కేంద్రాలలో విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ పొందుతారు . ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉచిత అల్పాహారం , భోజన సౌకర్యాలు కల్పించాలి . కోచింగ్ కేంద్రాలలో ప్రవేశంపొంది గుర్తింపు కార్డులు ఉన్నవారందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు తమ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగ యువతను తీవ్ర ఇబ్బందులకు గుర్తిచేస్తున్నాయి.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రించాలని బీజేవైఎం తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ మోర్చా ఇన్చార్జ్ సాయిరాం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు వికాస్ రెడ్డి ,రాకేష్ సింగ్, నగేష్ యాదవ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మల్లికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ సందీప్ గౌడ్, పట్టణ, మండల అధ్యక్షుడు వినోద్ గౌడ్, రవి, ఆంజనేయులు, సాయిశ్రావణ్, మండల నాయకులు మహేందర్, అరవింద్, అవన్ , రఘు, ప్రవీణ్, రాకేష్ గౌడ్, మధు, వెంకట్, శ్రీకాంత్, నవీన్, ప్రవీణ్, హరిశ్వర్, సాయిరామ్ దర్శన్, తదితరులు పాల్గొన్నారు.