- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. శ్రీరామనవమికి అమిత్ షా!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వంపై బీజేపీ నేతలు పలు ఆరోపణలు చేస్తూ కేసీఆర్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 14న తెలంగాణలో పర్యటించేందుకు నిర్ణయించుకున్న షా.. అంతకు ముందే శ్రీరామనవమిని రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణంలో అమిత్ షా పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు సమాచారం. అనంతరం పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. అయితే, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర రెండో విడత గద్వాల నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏప్రిల్ 14న అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు.