Bigg Boss-8: హౌస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్!

by Hamsa |
Bigg Boss-8: హౌస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్!
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-8(Bigg Boss-8) సెప్టెంబర్ 1న మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో రోజు రోజుకు పలు ట్విస్టులతో ప్రేక్షకాదరణను పెంచుకుంటోంది. అయితే ఇందులో సరికొత్త ట్విస్టులు ఇస్తూ జనాలను అయోమయంలో పడేస్తున్నారు బిగ్‌బాస్. ఇటీవల అన్ని సీజన్లకు చెందిన కొందరు మాజీ కంటెస్టెంట్స్‌ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్-8 (Bigg Boss-8)మరికొద్ది గంటల్లో ఏడో వారం పూర్తి చేసుకుని 8వ వారంలోకి అడుగుపెట్టనుంది.

చూస్తుండగానే వీకెండ్ వచ్చేసింది. అయితే ప్రతి వారం ఎవరో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు రావాల్సిందే. ఈ క్రమంలో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారోనని ప్రేక్షకులు టెన్షన్‌లో ఉన్నారు. అయితే హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠలతో కలిపి మొత్తం 9 మంది ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు బయటకు వెళతారో అర్థం కాక అంతా అయోమయంలో పడ్డారు.

ఈ నేపథ్యంలో.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ శాతం తక్కువగా రావడంతో హౌస్ నుంచి బయటకు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చేది ఎవరు? అని కన్ఫామ్ కావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Advertisement

Next Story