'రంగ రంగ వైభవంగా' బిగ్ అప్‌డేట్.. మే 27న ప్రేక్షకుల ముందుకు

by Disha Desk |
రంగ రంగ వైభవంగా బిగ్ అప్‌డేట్.. మే 27న ప్రేక్షకుల ముందుకు
X

దిశ, సినిమా : మొదటి సినిమా 'ఉప్పెన'తో సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ప్రస్తుతం 'రంగ రంగ వైభవంగా' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో వైష్ణవ్ సరసన 'రొమాంటిక్' ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌తో మూవీపై అంచనాలు పెరిగిపోగా.. తాజాగా బిగ్ అప్‌డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమాను మే 27న ప్రేక్షకుల విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మూవీ యూనిట్.. హీరో హీరోయిన్లతో కూడిన పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

https://twitter.com/SVCCofficial/status/1492083492565381121?s=20&t=PMqnc2P0HJ1RWWq_liyviA

Advertisement

Next Story