లక్కీ డ్రా పేరుతో ఘరానా మోసం.. లబోదిబోమంటున్న బాధితులు

by Javid Pasha |   ( Updated:2022-03-31 17:31:53.0  )
లక్కీ డ్రా పేరుతో ఘరానా మోసం.. లబోదిబోమంటున్న బాధితులు
X

దిశ, తిమ్మాపూర్ : ఉచితంగా డబ్బులు వస్తాయంటూ అందరూ క్యూ కట్టేస్తారు. దాన్నే మోసగాళ్లు క్యాష్ చేసుకుంటుంటారు. తాజాగా కరీంనగర్‌లో ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. లక్కీ డ్రా అంటూ నగర ప్రజలను మోసం చేశారు. ప్రతి నెల 1000 రూపాయలు కడితే ప్రతి నెల తీసే లక్కీ డ్రాలో టీవీలు, ఫ్రిజ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్స్ ఇస్తామంటూ ప్రజల నెత్తిన టోపీలు పెట్టారు. నెలనెల రూ.1000 చొప్పున భారీ సంఖ్యలో బాధితుల నుంచి డబ్బులు గుంజారు. దాదాపు 5కోట్లు వసూలు చేశారు.

ఈ తంతునంగా ఎంకె ఎంటర్ప్రైజెస్ పేరుతో చేస్తున్నారు. ఇదే పేరుతో కరీంనగర్‌లోని ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్‌లో లక్కీ డ్రా పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీన్ని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కార్యక్రమానికి చేరుకోగా నిర్వాహకుల్లో కొంతమంది పారిపోయారు. మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మోసపోయామని గమనించిన బాధితులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed