బ్రేకింగ్: నేడు, రేపు భారత్ బంద్.. రోడ్డెక్కిన కార్మిక సంఘాలు..

by Satheesh |   ( Updated:2022-03-28 03:33:48.0  )
బ్రేకింగ్: నేడు, రేపు భారత్ బంద్.. రోడ్డెక్కిన కార్మిక సంఘాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు సోమవారం, మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. 48 గంటలపాటు భారత్ బంద్ కొనసాగనుంది. భారత్ బంద్‌కు మద్దతుగా కార్మికసంఘాలు దేశ వ్యాప్తంగా రోడ్డెక్కాయి. ఎస్మా చట్టం ప్రయోగించిన కార్మికులు బెదరబోమన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించింది. దీనితో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్మిక సంఘాల బంద్‌కు మద్దతుగా సింగరేణిలో సంపూర్ణంగా బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు నిలిచిపోయాయి. బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా, ఉక్కు, చమురు, టెలికం, బొగ్గు, పోస్టల్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఇవాళ ఉదయం పలు రాష్ట్రాల్లో కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ప్రదర్శనలు చేశారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయి. భారత్‌ బంద్‌ పిలుపు చాలా చోట్ల విజయవంతంగా మొదలైంది.

Advertisement

Next Story