- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగుల జల్లు.. హోలీ ఆడేముందు ఈ చిట్కాలు పాటిస్తే ఎంతో మంచిది
దిశ, ఫీచర్స్ : ఉత్సవంలా జరుపుకునే హోలి పండుగ ఉత్సాహంతో పాటు ఉషస్సును మోసుకొస్తుంది. రంగుల జల్లులో సరికొత్త వెలుగులు విరజిమ్ముతుంది. కానీ రంగులతో ఆడుతున్నప్పుడు అజాగ్రత్తగా ఉంటే.. అలెర్జీల నుంచి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. హోలి సందర్భంగా వాడే కలర్స్‌లో భారీ లోహాలు, కెమికల్స్, పెస్టిసైడ్స్ వంటి హానికర పదార్థాలు చర్మం, కళ్లతో పాటు శ్వాసకోశ వ్యవస్థపై వినాశకర ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సేంద్రియ రంగులే దీనికి ఉత్తమ పరిష్కారమని చెప్తున్నారు. ఈ క్రమంలో రంగుల వల్ల కలిగే దుష్ర్పభావాలతో పాటు నివారణా మార్గాలు.
శ్వాసకోశ సమస్యలు..
హోలి ఆటలో వాడే రంగులు శ్వాసకోశ సమస్యలకు దారి తీయొచ్చు. ఒళ్లంతా రంగుల్లో మునిగిపోయినపుడు కొంత మొత్తం నోటి గుండా శరీరంలోకి ప్రవేశించి ఆస్తమా, బ్రాంకైటిస్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD) వంటి పరిస్థితులను తీవ్రతరం చేస్తుంది. ఇది శ్వాస లోపం, దగ్గు, కఫం సమస్యలను సృష్టిస్తుంది. రంగుల్లో ఉండే క్రోమియం కంటెంట్ కారణంగా బ్రాంకైటిస్, ఆస్తమా, అలర్జీలు తలెత్తుతాయని ముంబై, వోకార్డ్ హాస్పిటల్స్ చెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ సంగీత చెక్కర్ తెలిపారు. అంతేకాదు మెర్క్యురీ అవశేషాలు మూత్రపిండాలు, కాలేయంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇక ఐరన్ వల్ల స్కిన్ సెన్సిటివిటీ, సిలికా వల్ల పొడి చర్మ సమస్యలు రావచ్చని వెల్లడించారు.
కంటి ఎలర్జీలు
సాధారణంగా పాదరసం, ఆస్బెస్టాస్, సిలికా, మైకాతో పాటు సీసం వంటి ప్రమాదకర రసాయనాలతో హోలీ రంగులు తయారు చేస్తారు. ఇవి చర్మం, కళ్లకు విషపూరితమైనవి కాగా.. కండ్లలో దురద, కండ్లకలక, కళ్లు ఎర్రబడటం, వాపు రావడంతో పాటు నీరు కారడం వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ రంగుల్లో వాడే రసాయనాలు కళ్లకు తాకినట్టయితే విపరీతమైన మంటకు, ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయి. అయితే చాలా మందికి ఈ రంగుల వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియక లైట్ తీసుకుంటారని ముంబై, అపోలో స్పెక్ట్రాలో స్కిన్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ మృణ్మయీ ముకుంద్ చెప్పారు.
స్కిన్ ఇన్‌ఫెక్షన్స్..
హోలి రంగుల్లో భారీ లోహాలు, పగిలిన గాజు ముక్కలు, కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉంటాయి. దీంతో చాలా మంది వ్యక్తులు హోలి కలర్స్‌తో ఆడిన తర్వాత బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్‌ఫెక్షన్స్, స్కిన్ ఎలెర్జీస్‌తో లేదా డెర్మటైటిస్, దద్దుర్లు, దురదలు, మంటలతో ఇబ్బంది పడుతూ వైద్యులను సంప్రదిస్తారని డాక్టర్ ముకుంద్ పేర్కొన్నారు.
నివారణ చిట్కాలు..
* ఆర్గానిక్ రంగులనే ఉపయోగించాలి. హోలి ఆడే ముందు మీ చర్మానికి మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకోవాలి.
* సన్‌స్క్రీన్ లోషన్‌తో పాటు సన్‌గ్లాసెస్ పెట్టుకోవాలి. లెన్స్‌లు ధరించకపోవడమే మంచిది.
* కళ్లను తాకడం లేదా రుద్దడం మానుకోవాలి. ఎందుకంటే చికాకు లేదా ఇతర కంటి సమస్యలను కలిగిస్తుంది.
* చేతులు కవర్ అయ్యేలా బట్టలు నిండుగా ధరించాలి. బెలూన్స్ ఉపయోగించవద్దు.
* రంగులను తొలగించేందుకు డిటర్జెంట్, స్పిరిట్, నెయిల్ పాలిష్ రిమూవర్, ఆల్కహాల్ లేదా అసిటోన్ వాడకూడదు.
* డాక్టర్ సిఫార్సు చేసిన సబ్బునే ఉపయోగించాలి. గట్టిగా స్క్రబ్ చేయొద్దు, చర్మాన్ని తేమగా ఉంచాలి.