- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖమ్మంలో యథేచ్ఛగా సిండి'కేటు' వ్యాపారం
దిశ, ఖమ్మం రూరల్: మద్యానికి బానిసలై యువత ఆనారోగ్యాల బారినపడి పిట్టాల్లా రాలిపోతుంటే నియంత్రించాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. మద్యం వ్యాపారం అంటే అందినకాడికి దోసుకోవడమే కాబోలు ప్రతి చిన్న మద్యం దుకాణానికి కోట్ల రుపాయలకు టెండ్లర్లు వేసి మద్యం షాపులను కైవసం చేసుకుంటున్నారు. ఒక్క షాపు పేరు చెప్పి మండలాల్లో వేలాది సంఖ్యల్లో గొలుసుకట్టు వ్యాపార దుకాణాలు నిర్వహిస్తున్నారు. వైన్‌షాపును నిర్వాహకులు ఉదయాన్నే తమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. ఆటోలో తమ సరకును యథేచ్ఛగా గ్రామాల్లో గల బెల్ట్‌షాపులకు విక్రయిస్తున్నారు. అక్రమ వ్యాపారం పక్కగా ఉండటం కోసం ఒక సొంత స్టిక్కర్‌ను సృష్టించి ప్రతి బాటిల్‌కు అతికించి విక్రయిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు ఖమ్మం నగరానికి అతిసమీపంలో ఉన్న రూరల్ మండలంలో గల వైన్‌షాపుల పరిస్థితి. ఇంతా జరుగుతున్నా పోలీస్, ఎక్సైజ్‌శాఖలు చోద్యం చూస్తున్నారే తప్ప నిలువరించడంలో విఫలమవుతున్నారు. మద్యం షాపుల యాజమానులు అధిక సంపాదనకు అలవాటుపడి సిండికేటుగా ఏర్పడి బెల్ట్ షాపుల వారికి అధిక ధరలకు ఎమ్మార్పీ రేటు మీద రూ.15 నుంచి 20 రుపాయల వరకు విక్రయిస్తుంటే బెల్టుషాపు యాజమానులు రూ. 30 నుంచి 50 రుపాయల వరకు అధికంగా విక్రయస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. ఇందుకు పోలీసుల, ఎక్సైజ్అధికారులు వంత పాడుతుండడంతో సిండికేటురాయుళ్ల వ్యాపారం మూడు బీర్లు అరుఫుల్బాటిల్లాగా కొనసాగుతోంది.
ఖమ్మం రూరల్‌మండలం, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమాలయపాలెం మండలాల్లో బెల్టుషాపుల్లో మద్యం వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అడపదడపా కేసులు నమోదు చేస్తున్నారే తప్ప బెల్టుషాపులు నిలువరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అవినీతిరహిత సమాజం కోసం సీఎం కేసీర్ అహర్నిషులు కృషి చేస్తుంటే అందుకు విరూద్ధంగా రూరల్ మండలంలో మద్యం వ్యాపారం రాజ్యమేలుతూంది.
అధిక ధరలకు మద్యం అమ్మకాలు
ఎంతైనా పర్వాలేదు షాపు మనమే దక్కించుకోవాలని కోట్ల రుపాయలకు టెండర్లు వేస్తున్నారు. పెట్టుబడులు పెట్టినవారు వాటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా అధిక లాభాలు సాధించాలనే దురాశతో మద్యం వ్యాపారులు మండల్లాలోని ఆయా గ్రామాల్లో బెల్టుపాపులు ఏర్పాటు చేస్తూ అందినకాడికి దోసుకుంటున్నారు. ప్రభుత్వం ఎమార్పీ ధరలకే విక్రయించాలని మద్యం షాపుల్లో విక్రయించాలనే నిబంధనలు విధించడంతో మద్యం వ్యాపారులు బెల్టుషాపులను ప్రొత్సహిస్తూ ఎమార్పీ కంటే అధిక ధరకు(రూ.20) విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. బెల్టుషాపులపై ఎటువంటి అధికారి వచ్చిన మాదే బాధ్యత అని బెల్టుషాపుల నుంచి ఒక్కో క్వార్టర్‌కు 20 రుపాయలు వసూళ్లు చేస్తున్నారు. బెల్టుషాపు యాజమానులు మందుబాబుల నుంచి క్వార్టర్ సీసాకు మరో 30 రుపాయలు, బీరుకు 50 రూపాయలు అధికంగా జోడించి అమ్ముతున్నారు.
దాబాల్లో యథేచ్ఛగా అమ్మకాలు
మండలంలోని వరంగల్క్రాస్రోడ్డు, కోదాడ క్రాస్‌రోడ్డు, వరంగల్బైపాస్రోడ్డు, వెంకటగిరి క్రాస్‌రోడ్డు, నాయుడుపేట బైపాస్, మారెమ్మగూడి రోడ్డు పక్కన గల దాబాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దాబాల్లో ఎమార్పీ కంటే అధికంగా అమ్ముతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని అరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. దాబాల్లో మద్యం అమ్మాకాలు నిషేదం ఉన్న మండలంలో మాత్రం పాటించడంలేదు. కేవలం పోలీసుల అలసత్వం వలనే దాబాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే అరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారుల వెంబడి దాబాలు ఉండంల వలన చాలామంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం.
పెడదారి పడుతున్న యువత
ఎక్కడపడితే అక్కడ మద్యం లభిస్తుండటంతో మద్యం మత్తుకు అలవాటుపడ్డ యువత పెడదారి పడుతుంది. ఇటీవల కాలంలో మండలంలోని పెద్దతండా, కాచీరాజీగూడెం, మద్దులపల్లి, పొన్నేకల్లు, తల్లంపాడుకు చెందిన యువకులు మద్యం వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాగా, విచ్చలవిడి మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేయకపోవడంతో మహిళలపై కూడా లైంగికదాడులు, దోపిడీలు, దొంగతనాలకు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లేనని మేధావి వర్గాలు వేల్లడిస్తున్నాయి.
ముడుపుల మత్తు వీడటం లేదు..
మద్యం అమ్మాకాలు, ధరలను నియంత్రించాల్పిన అధికారులు ముడుపుల మత్తు నుంచి ఇంకా తేరుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో అదే తంతు కొనసాతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముడుపులకు అలవాటుపడిన ఆయా స్థానాల్లో కొలువుల్లో కొనసాగుతుండటంతో ఎలా ప్రక్షాళన అవుతుందని ప్రశ్నలు పుట్టకొస్తున్నాయి. అధికారులకు స్థానం చలనం లేకపోవడంతో ముడుపులకు అలవాటుపడి వారి బాధ్యతలు విస్మరిస్తున్నారని ప్రజలకు బహిరంగంగానే చర్చింకుటున్నారు.
పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు
మండలంలోని బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. వేల సంఖ్యల్లో బెల్టుషాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మండలంలోని నాలుగు షాపులకు లైసెన్స్ ఉండగా వేలాది పైగా బెల్టుషాపులు ఉన్నాయంటే నమ్మశక్యంకాని విషయం. బెల్టుషాపుల నుంచి పోలీసులకు, ఎక్సైజ్‌శాఖకు చెందిన పోలీసులకు మాముళ్లు అందుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి దాడులు నిర్వహించకుండా ప్రతి స్టేషన్‌కు రూ. 40 వేలకు పైగానే అధికారులకు అప్పజేపుతున్నట్లు సమాచారం. అందుకే పోలీసులు నామమాత్రపు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.