- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యంగ్ హీరోపై చీటింగ్ కేసు.. అతడి తండ్రిపై కూడా..
by Javid Pasha |

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అతని తండ్రి బెల్లంకొండ సురేష్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పు తీసుకొని చెల్లించలేదని ఫైనాన్సియర్ శ్రావణ్ కుమార్ ఈ ఫిర్యాదు చేశాడు. తన వద్ద నుంచి తండ్రి కొడుకులు 2018-19లో రూ.85 లక్షలు తీసుకున్నారని, వాటిని ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదని అతడు పేర్కొన్నాడు. తాము తెరకెక్కిస్తున్న సినిమాలో భాగంగా తీసుకుంటున్నట్లు తెలిపారని, తిరిగి ఇవ్వమంటే తనను బెదిరించారని కూడా వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు దర్యా్ప్తుకు హాజరుకావాలని బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సురేష్‌కు తెలిపామని చెప్పారు. అయితే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.
Next Story