- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఎంగిలి మెతుకులు మాకొద్దు: జాజుల శ్రీనివాస్ గౌడ్
దిశ, ముషీరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు విసిరిన ఎంగిలి మెతుకులు మాకు అవసరం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజూల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు బీసీబంధు పెట్టకపోతే టీఆర్ఎస్‌కు ఓట్ల బంధు పెడతామని హెచ్చరించారు. ఒకటి కాదు రెండు కాదు వెయ్యి మంది పీకేలను తెచ్చుకున్నా.. పీకేది ఏమీ లేదన్నారు. బీసీల బడ్జెట్‌ను తగ్గించినందుకు నిరసనగా ఈనెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ దోమలగూడలోని బీసీ భవన్‌లో మంగళవారం సాయంత్రం జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. 2 లక్షల 56 వేల కోట్ల బడ్జెట్‌లో రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీ జనాభాకు రూ. 5697 కోట్లు కేటాయించడమంటే కేవలం రెండు శాతమే బీసీలకు కేటాయించినట్లు అవుతుందన్నారు. బడ్జెట్‌లో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు.
బీసీ జాతికి అన్యాయం జరుగుతుంటే ఎదిరించే దమ్ము లేదా? అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా గెలవలేననే పీకేను అరువు తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. అరువు తెచ్చుకున్న వాళ్లతోని గెలుపు సాధ్యం కాదని.. బీసీల హృదయాలను గెలుచుకొనీ గెలవాలని హితవు పలికారు. బడ్జెట్‌లో బీసీల వాటా ప్రకారం కేటాయించాలని, మాకు కేసీఆర్, హరీశ్ రావుల తాతల ఆస్తులు ఇవ్వడంలేదని మండిపడ్డారు. బీసీల హృదయాలు గెలుచుకుంటేనే, మళ్ళీ 2023లో మూడోసారి ముఖ్యమంత్రి అవుతావని, ప్రతిపక్ష స్థానం కూడా దక్కదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్‌పై తక్షణమే అసెంబ్లీలో రివ్యూ చేయాలని, బీసీ సబ్ ప్లాన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీసీ కులాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ కనకాల, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, నగర అధ్యక్షులు మాదేశి రాజేందర్, నాయకులు పానుగంటి విజయ్, మల్లికార్జున్, సాయి తేజ్, నాగరాజ్ గౌడ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.