- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ ఎఫెక్ట్: జీరో దందాపై కలెక్టర్ సీరియస్.. ఆ అధికారి పాత్రపైనే ఆరా..!
దిశ ప్రతినిధి, వరంగల్: ఎనుమాముల మార్కెట్లో జరుగుతున్న జీరో దందాపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. జీరో దందా యథేచ్ఛగా సాగుతున్న విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా 'దిశ' పత్రికలో కథనాలు పలుమార్లు ప్రచురితమైన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో మీడియాలో కథనాలు రాకపోవడంతో పాటు మార్కెట్లో యథేచ్ఛగా జరుగుతున్న జీరో దందాను కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా.. స్పందించకపోవడం వెనుక కార్యదర్శికి ఈ అక్రమ దందాలో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయంపై మంగళవారం దిశ మీడియాలో కథనం ప్రచురితం కావడంతో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, వరంగల్ కలెక్టర్ సీరియస్ అయినట్లు సమాచారం.
కలెక్టర్ ఆరా.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం..
ఎనుమాముల మార్కెట్లో జరుగుతున్న జీరో దందాపై దిశ పత్రికలో సమగ్రమైన కథనం ప్రచురితం కావడంతో వరంగల్ కలెక్టర్ గోపి వరంగల్ మిర్చి మార్కెటింగ్ శాఖ అధికారి ప్రసాద్‌తో మాట్లాడినట్లు సమాచారం. మార్కెట్లో జరుగుతున్న కొనుగోళ్లపై సమగ్ర నివేదిక అందజేయాలని, అందులో అధికారుల పాత్రపైనా విచారణ చేపట్టాలని ఆదేశించడం గమనార్హం. ఇదే విషయంపై వరంగల్ మిర్చి మార్కెట్ అధికారి ప్రసాద్‌ను 'దిశ' వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాలు నిజమేనని స్పష్టం చేశారు. మార్కెట్లో జరుగుతున్న కొనుగోళ్లపై నివేదిక అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యదర్శిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. క్షేత్రస్థాయిలో తనిఖీలు, చర్యలు ఎందుకు ఉండటం లేదన్న దిశ ప్రశ్నలకు.. ఖచ్చితంగా తనిఖీలు చేపడతామని, ఎవరిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. మార్కెట్లో కొనుగోళ్లు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.