- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం... దాడి చేసిన ఇద్దరు యువకులు
దిశ, వెబ్‌డెస్క్: ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తోన్న బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పీఎస్ఓ, డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఒడిస్సాలోని లోయిసింగా ఎమ్మెల్యే ముఖేశ్ మహాలింగ్ త్రుటిలో దాడి నుంచి తప్పించుకున్నారు. బడి బహల్ ప్రాంతంలోని ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు పార్కింగ్‌లో ఉన్న కారు తీస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఇద్దరు యువకులు బైకును కారుకు అడ్డం పెట్టి బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే డ్రైవర్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ వారిని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువకులు పీఎస్ఓ, డ్రైవర్‌ను వాహనం నుంచి బయటకు లాగి దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయలు అయ్యాయి. దీంతో ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, జరిగిన ఘటనపై ఎమ్మెల్యే మహాలింగ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.