- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి అనుకోకుండా మెలుకువ వస్తోందా..? మీరు డేంజర్‌లో పడ్డట్లే..!
దిశ, ఫీచర్స్: అర్ధరాత్రి నిద్రలో నుంచి మెలుకువ రావడం సర్వసాధరణం. కానీ, ఇలా పదే పదే మెలుకువ రావడం డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక ప్రమాదకరమైన వ్యాధికి సంకేతమని తెలిపారు. చాలామందికి అర్థరాత్రి 12 గంటల కంటే ముందే నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ, కొద్దిసేపటి తరువాత మెలుకువ వస్తుంటుంది. ఒక్కసారిగా నిద్రలేచిన తరువాత అస్సలు నిద్రపట్టదు. దీనికి కారణం అనారోగ్య సమస్యేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 4 గంటల మధ్యలో మెలుకువ వస్తుంటే అది కాలేయ సంబంధిత సమస్యకు సంకేతమని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం చేసే పనికి ఒక షెడ్యుల్ ఉంటుంది. అలాగే మన శరీరానికి ఒక షెడ్యుల్ ఉండాలి. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, తరువాత కొంత శ్రమ, సాయంత్రం డిన్నర్ తరువాత నిద్ర. ఇలా శరీరానికి ఒక షెడ్యుల్ ఉంటుంది. మనం నిద్రపోయిన తరువాత కాలేయం ఎక్కువగా పనిచేస్తుంది. శరీరంలో మలినాలను క్లీన్ చేసి, బ్లడ్‌ను ప్యూరిఫై చేస్తుంది.
కానీ, కాలేయ సమస్య ఉన్నవారిలో ఈ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఈ సమస్యను నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌గా వైద్యులు చెబుతుంటారు. ఈ వ్యాధిబారిన పడిన వారికి కాలేయం సరిగా పనిచేయదు. లివర్‌లో కొవ్వు కణాలు పోరుకుపోతాయి. అయితే, ఈ కాలేయంలో కొవ్వు ఎక్కువగా ఉన్నా, దాని పనితీరుసరిగా లేకపోయినా డీటాక్సిఫై చేయడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. దీంతో నాడీ వ్యవస్థ మేల్కొంటుంది. దీని కారణంగా మనకు మెలుకువ వస్తుంది. ఇదే నిద్ర చెడిపోవడానికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అధిక బరువు, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్న వారికి ఈ సమస్య ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిబారిన పడుకుండా ఉండాలంటే అర్ధరాత్రిళ్లు ఫ్యాట్ ఫుట్ తినకూడదు. రాత్రి భోజనం తరువాత కొంత సమయం నడిస్తే మంచిది. ఇది మాత్రమే కాకుండా రోజువారి ఆహారంలో భాగంగా ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.