- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దీపావళి జరుపుకోవాలంటే ఆస్తమా రోగులు సంకోచిస్తున్నారా? ఈ బెస్ట్ టిప్స్ మీ కోసం..!
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali) అంటే అందరికీ గుర్తొచ్చేది ముందుగా టపాకాసులు(Crackers) పేల్చడం. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ ఫేస్టివల్(festival)ను ఇష్టపడుతారు. దీపావళికి ఎంతో ప్రత్యేకత ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ఫేస్ట్ ను 5 డేస్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు కొనుక్కుంటారు. ఇళ్లంతా కొత్తగా మార్చుతారు. హిందువుల పండగల్లో అత్యంత ముఖ్యమైనది దీపావళి ఒకటి అని చెప్పవచ్చు. అయితే దీపావళి నాడు చాలా మంది టపాసులు, బాణసంచా కాల్చుతారు. కానీ ఈ సమయంలో ఆస్తమా రోగులకు(asthma patients) వ్యాధి మరింత తీవ్రమవుతుంది.
వాయుకాలుష్యం(Air pollution) వల్ల పెరిగి.. పొగలో సల్ఫర్ డయాక్సైడ్(Sulphur dioxide), సీసం, పొటాషియం, నైట్రోజన్ ఆక్సైడ్(Nitrogen oxide), సోడియం వంటి విషపదార్థాలు(Toxins)అధికంగా ఉంటాయి. దీంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. అంతేకాకుండా అలెర్జీలకు కారణమవుతాయి కూడా. కాగా ఆస్తమా వ్యాధిగ్రస్తులు దీపావళికి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
దీపావళి నాడు ఆస్తమా రోగులు నాణ్యమైన మాస్క్(Quality mask) ధరించడం మంచిది దీంతో వాయు కాలుష్యం నుంచి బయటపడొచ్చు. అలాగే మీ శ్వాస మార్గాలను తేమగా ఉంచడానికి వాటర్ ఎక్కువగా తీసుకోండి. దీపావళి రోజు కొవ్వు, మసాలా ఫుడ్స్(Spicy Foods)కు దూరంగా ఉండండి. అలాగే వెచ్చగా ఉండే బట్టల్ని వేసుకోండి. స్మోక్కింగ్ (Smoking)చేయడం మానాలి. శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం మేలు. నేరుగా ఏసీ, ఫ్యాన్ల కింద కూర్చోవద్దు. దుమ్ము, పొగ ప్రాంతాలకు దూరంగా ఉండండి. అలాగే దీపావళికి ముందు వైద్యుడ్ని సంప్రదించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాలను పాటిస్తే దీపావళికి ఆస్తమా రోగులు ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.