ఆ చట్టాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని.. తులసిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Manoj |   ( Updated:2022-03-05 10:21:22.0  )
ఆ చట్టాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని.. తులసిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో : 'దేశానికి ఢిల్లీ రాజధాని ఉంది. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక రాజధాని మాత్రమే ఉంది. ఏపీ కంటే నాలుగు రెట్లు పెద్దదైన యూపీకి కూడా ఒకే రాజధాని ఉంది. పీఎం స్వరాష్ట్రం గుజరాత్‌కి కూడా ఒకే రాజధాని ఉంది. అభివృద్ధి చెందిన కేరళ రాష్ట్రానికి కూడా ఒకే రాజధాని ఉంది' అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వెల్లడించారు. విభజన చట్టంలోని సెక్షన్ 6, సెక్షన్ 94(3), సెక్షన్ 94(4), 13వ షెడ్యూల్ లోని 11వ అంశం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని మాత్రమే ఉండాలి.

కాబట్టి మూడు రాజధానుల నిర్మాణం అసంభవం.. అని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని, విశ్రాంతి ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వలేని, రోడ్ల మీద గుంతలు పుడ్చలేని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. పేదలకు మూడు ఇళ్లు కట్టలేని, మూడు లెట్రిన్లు కట్టలేని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తుందా! అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుంది జగన్ ప్రభుత్వ వాలకం అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి హై కోర్టు తీర్పును అమలు చేయాలని సీఎం జగన్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed