Pension: మీ జీతం 30,000 అయితే.. రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్ ఎంత వస్తుందో తెలుసుకోండి

by Vennela |
Pension: మీ జీతం 30,000 అయితే.. రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్ ఎంత వస్తుందో తెలుసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్: Pension: ఏ ఉద్యోగి అయినా సరే రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. తమకు సొంత ఇల్లు ఉండాలని, పిల్లల చదువుల ఖర్చులకు సరిపడా డబ్బులు ఉండాలని భావిస్తారు. ఉద్యోగుల ఈ కలల సాకారానికి దోహదం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకీక్రుత పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం. దీనికి ఉద్యోగులు, ప్రభుత్వం ఇరుపక్షాల నుంచి కంట్రిబ్యూషన్ లభిస్తుంది. దీనిలో చేరేవారికి రిటైర్మెంట్ తర్వాత నిర్థిష్ట, కుటుంబ పెన్షన్ తోపాటు కనీస పెన్షన్ హామీ కూడా లభిస్తాయి.

ఏకీక్రిత పెన్షన్ విధానం అనేది నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వస్తుంది. దీనిలో చేరే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతినెలా స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఈ స్కీమ్ ఫండ్ ఆధారిత పెన్షన్. ఉద్యోగులకు ప్రభుత్వం ఇరుపక్షాల నుంచి కంట్రిబ్యూషన్ మొత్తాలు అందుతాయి. ఈ నిధులనే పెట్టుబడుల్లోకి మళ్లిస్తారు వాటి ద్వారా వచ్చే ఆదాయాన్నే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగికి ప్రతినెలా నిర్దిష్ట మొత్తంలో అందిస్తారు. దీని వల్ల రిటైర్డ్ ఉద్యోగి నిశ్చితంగా జీవితాన్ని గడుపుతాడు.

ఉదాహరణకు ఒక ఉద్యోగి 25ఏళ్లపాటు పనిచేస్తాడని అనుకున్నట్లయితే పదవీ విరమణ సమయానికి అతని నెలలవారీ సగటు వేతనం రూ. 30 వేలు అనుకుంటే ఏకీక్రిత పెన్షన్ స్కీమ్ కింద అతనికి ప్రతినెలా రూ. 15వేల వరకు పెన్షన్ వస్తుంది ఒకవేళ సదరు ఉద్యోగి ఏదైనా కారణంతో మరణించినట్లయితే అతని జీవిత భాగస్వామికి 60శాతం పెన్షన్ అంటే ప్రతినెలా దాదాపు రూ. 9000 వరకు లభిస్తుంది. కనీసం పదేళ్లు జాబ్ సర్వీస్ పీరియడ్ ఉన్న ఉద్యోగులకు ప్రతినెలా రూ. 10వేల వరకు పెన్షన్ లభిస్తుంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి ఏకీక్రిత పెన్షన్ స్కీమ్ ను ఎంచుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రయోజనాలు పొందవచ్చు. దీనికోసం వారు కనీసం 10ఏళ్ల సర్వీస్ పూర్తి చేయాలి. 25ఏళ్ల పాటు ఉద్యోగంలో పనిచేశాక స్వచ్చందంగా రిటైర్మెంట్ చేస్తే సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వయస్సుకు చేరుకున్న తేదీ నుంచి ప్రతినెలా పెన్షన్ లభిస్తుంది. ఒక ఉద్యోగి ఎఫ్ఆర్ 56 కింద రిటైర్మెంట్ చేసిన తేదీ నుంచి పెన్షన్ అందుతుంది.



Next Story

Most Viewed