థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న మహేష్ బాబు డిజాస్టర్ మూవీ.. అలాంటి కళా ఖండాన్ని మరోసారి చూడలేము బాబూ అంటూ కామెంట్స్

by Kavitha |
థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న మహేష్ బాబు డిజాస్టర్ మూవీ.. అలాంటి కళా ఖండాన్ని మరోసారి చూడలేము బాబూ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్(ReRelease) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాలను, కల్ట్ క్లాసిక్ సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అలా ఈ ఏడాదిలో ఇప్పటికే లెక్కలేనన్ని చిత్రాలు రీ రిలీజ్ చేయబడ్డాయి. వాటిల్లో కొన్ని సినిమాలను అభిమానులు విశేషంగా ఆదరించారు. దీంతో మరిన్ని చిత్రాలు రీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు డిజాస్టర్ మూవీని రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మహేష్ చిత్రాలకు థియేటర్లలో మంచి స్పందన లభిస్తుండటంతో, దాన్ని క్యాష్ చేసుకోవడానికి వరుసగా రీరిలీజులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చి 9 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, కృష్ణ జయంతి సందర్భంగా మే 30న రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. అలాంటి కళాఖండాన్ని మరోసారి చూడలేము బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈసారి థియేటర్లలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

పోస్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Next Story