పీరియడ్ ట్రాకింగ్ యాప్స్.. వెంటనే డిలీట్ చేయలేదంటే..

by Manoj |   ( Updated:2022-06-27 10:28:46.0  )
పీరియడ్ ట్రాకింగ్ యాప్స్.. వెంటనే డిలీట్ చేయలేదంటే..
X

దిశ, ఫీచర్స్ : 'రోయ్ వి వేడ్‌' రద్దు చేస్తూ అబార్షన్‌ను చట్టబద్దం చేసింది యూఎస్ సుప్రీం కోర్టు. దీంతో అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తగా.. అధికారులు వ్యక్తిగత సమాచారాన్ని కూడా యాక్సెస్ చేయగలరని, మహిళలు తమ ఫోన్‌లోని పీరియడ్ ట్రాకర్‌ యాప్స్ తొలగించాలన్న సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అబార్షన్ చట్టబద్ధమైన కొద్ది సేపటికే యువ రచయిత్రి జెస్సికా ఖోరీ 'ఈరోజే మీ పీరియడ్ ట్రాకింగ్ యాప్‌లను తొలగించండి' అంటూ ట్వీట్ చేయగా.. అది కాస్తా లక్షల్లో రీట్వీట్స్, కామెంట్స్ సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. పీరియడ్ ట్రాకింగ్ యాప్‌ల నుంచి పొందే డేటా అబార్షన్ ఆరోపణలకు సాక్షంగా ఉపయోగించవచ్చని, ఈ విషయంలో మనం అందరం ఒక జాతిగా ఉన్నందుకు గర్వంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఈ భయం వ్యాప్తి చెందుతున్నందునా.. పీరియడ్ ట్రాకింగ్ యాప్ యాజమాన్యాలు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటున్నాయి. 12Mపైగా కస్టమర్‌లను కలిగి ఉన్న యూరోపియన్ పీరియడ్ ట్రాకింగ్ యాప్ 'క్లూ'.. యూరోపియన్ చట్టం ప్రకారం తమ యూజర్స్ ప్రైవేట్ సమాచారాన్ని బహిర్గతం చేయమని ప్రకటించింది.

'మేము యూరోపియన్ దేశంగా బెర్లిన్‌లో ఉన్నందున, 'క్లూ' మా వినియోగదారుల పునరుత్పత్తి ఆరోగ్య డేటాకు ప్రత్యేక రక్షణలను యూరోపియన్ చట్టం (జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్, GDPR) ప్రకారం వర్తింపజేసే బాధ్యత తీసుకుంటుంది. మేము మా కస్టమర్స్ కోసం మాత్రమే నిలబడతాం. సమాచారాన్ని బహిర్గతం చేయం' అని వెల్లడించింది.

Advertisement

Next Story