కెప్టెన్ అమరీందర్ సింగ్‌ బీజేపీతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని నడిపించారు: ప్రియాంక గాంధీ

by Disha Desk |
కెప్టెన్ అమరీందర్ సింగ్‌ బీజేపీతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని నడిపించారు: ప్రియాంక గాంధీ
X

ఛండీగఢ్: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ సహాయంతో ప్రభుత్వాన్ని నడిపించారని ఆరోపించారు. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రసంగించారు. ఆయన ప్రభుత్వాన్ని పంజాబ్ నుంచి నడపడం మానేశారు. ఢిల్లీ నుంచి పనిచేశారు. కాంగ్రెస్‌తో కాకుండా బీజేపీ, బీజేపీ కూటమి ప్రభుత్వంతో నడిపించారు' అని అన్నారు. గాంధీ కుటుంబానికి చాలా కాలం నిజాయితీగా ఉన్న ఓ వ్యక్తి కొన్ని రోజుల నుండి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆయన అసలు రంగు బయటపడిందని తెలిపారు. 'మేము చరణ్ జీత్ సింగ్‌ను కలిగి ఉన్నాం. ఆయన మీలో ఒకరే. ఆయనకు మీ సమస్యలు తెలుసు అని' అన్నారు. ఇక ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 'ఢిల్లీ నుంచి మరో రాజకీయ పార్టీ వచ్చింది. మీకు ప్రకటనల ద్వారా ఢిల్లీ మోడల్‌ని చూపుతున్నారు. మీ వద్దకు వచ్చి ఢిల్లీ మోడల్‌ను, ఢిల్లీలో ప్రభుత్వం చేసిన పనిని ప్రచారం చేస్తున్నారు' అని అన్నారు. అయితే ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో విఫలమైందని ఆరోపించారు. కాగా 117 స్థానాలున్న పంజాబ్‌లో ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. పరోక్షంగా కెప్టెన్ అమరీందర్ ను ఉద్దేశించి ప్రియాంకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Next Story