'పుష్ప' నుంచి మరో అప్‌డేట్.. ఈ వారమే ప్రేక్షకుల ముందుకు

by Harish |
పుష్ప నుంచి మరో అప్‌డేట్.. ఈ వారమే ప్రేక్షకుల ముందుకు
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం 'పుష్ప: ది రైజ్'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే సినిమా కంటే అల్లు అర్జున్ మ్యానరిజం, డైలాగ్స్ అభిమానులతోపాటు సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకోగా.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధమైంది. తాజాగా 'పుష్ప' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌లకు సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ శాటిలైట్‌ హక్కులను మా టీవీ భారీ ధరకు సొంతం చేసుకోగా.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 'పుష్ప' ప్రీమియర్‌ని ప్రసారం చేయబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్ తమ నటనతో ఇరగదీయగా.. ప్రస్తుతం రెండో పార్ట్ విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement

Next Story