- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మణుగూరు మున్సిపల్ అధికారుల అవినీతిపై ఇంటెలీజెన్స్ ఆరా
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల మున్సిపాలిటీ కార్యాలయం లో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై 'దిశ' పత్రికలో మూడు రోజుల నుంచి ప్రచురిస్తున్న సంగతి విధితమే. అయితే మంగళవారం ఇంటెలిజెన్స్ అధికారులు మండలంలోని మున్సిపాలిటీని కార్యాలయాన్ని సందర్శించి అవినీతి గురించి ఆ ముగ్గురు వ్యక్తుల గురించి వారి ఆస్తిపాస్తులు, వారి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో మున్సిపాలిటీ కార్యాలయంపై, ఆ ముగ్గురికి సహకరిస్తున్న నాయకులపై ఇంటెలిజెన్స్ గట్టి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
మున్సిపాలిటీ కాంట్రాక్ట్ వర్క్ లు చేసిన కొంత మంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు వ్యక్తులు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే పనులు చేసిన కాంట్రాక్ట్ బిల్లులు, చెక్కులను ఆపేస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారని తెలిసింది.
దీంతో ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులపై నిఘా పెట్టినట్లు, 'దిశ' పత్రికలో వచ్చిన కథనాలు రుజువైతే వారిపై కఠిన చర్యలు తప్పావన్నట్లు మున్సిపాలిటీ వ్యాప్తంగా వినపడుతోంది. మరి ఆ ముగ్గురు వ్యక్తులు చేసిన అవినీతిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఏ మేరకు చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే.