టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడి వియ్యంకుడు మృతి

by Vinod kumar |   ( Updated:2022-04-05 12:29:46.0  )
టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడి వియ్యంకుడు మృతి
X

దిశ, హ‌న్మకొండ టౌన్: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) వియ్యంకుడు, గ్రానైట్ వ్యాపారి విన్నకోట అజయ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రెండు రోజుల క్రితమే గుండెకు శస్త్ర చికిత్స చేశారు. కోలుకుంటున్న క్రమంలోనే మళ్లీ ఆయన గుండె పోటుకు గురయ్యారు. గుండె బలహీనంగా ఉండటం చేత ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అజయ్ కుమార్ అంత్యక్రియలు బుధవారం ఉదయం హైదరాబాద్ లో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Next Story