- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్కోకు విమానాలు ఆపేసిన ఎయిర్ ఇండియా.. కారణం అదే..
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచమంతా రష్యాకు వ్యతిరేకంగా మారినప్పటికీ భారత్ మాత్రం తన స్నేహబంధాన్ని వదులుకోలేదు. ఎప్పటిలానే రష్యాతో తన వర్తకాన్ని కొనసాగించింది. రష్యాతో వర్తకంపై భారత్‌ను ప్రపంచదేశాలు ప్రశ్నించినప్పటికి తన తీరు మార్చుకోలేదు. అయితే తాజాగా ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇండియా నుంచి రష్యా రాజధాని మాస్కోకు వెళ్లే విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తాజాగా ప్రకటించింది. వారానికి రెండుసార్లు వెళ్లే ఈ నాన్-స్టాప్ విమానాలను మాస్కోకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే 2022 ఏప్రిల్ 1న పునరుద్దరించిన ఇన్సూరెన్స్ ప్రకారం మాస్కో, ఉక్రెయిన్‌లలో విమానాలు ల్యాండ్ అవ్వడం కానీ, అక్కడి నుంచి ఎగరడం కానీ చేయకూడదు. అందువల్లే విమానాలను నిలిపివేశామని ఎయిర్ ఇండియా వారు తెలిపారు. కానీ 5-6 కంపెనీల పునరుద్ధరించబడిన ఇన్సూరెన్స్ ప్రకారం రష్యా ఆకాశ మార్గం నుంచి విమానాలు ప్రయాణం కొనసాగించవచ్చని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.