Allu Arjun: పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఆ హిట్ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

by Prasanna |   ( Updated:2024-10-14 05:09:01.0  )
Allu Arjun Declines 10 Crore Deal to Promote Liquor Brands
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు అందుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం, అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డిసెంబర్ లో ఈ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందని అందరూ ముందుగానే కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయనున్నారా అని చాలా మందికి సందేహం ఉంది. తాజాగా ఈ విషయం పై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.

నాగవంశీ "అల్లు అర్జున్ తర్వాత ప్రాజెక్ట్ మా బ్యానర్ లోనే త్రివిక్రమ్ తో చేస్తున్నాడని చెప్పాడు. ఇది ఓ పాన్ ఇండియా సబ్జెక్టు, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.. ఇప్పటి వరకు ఇలాంటి కథతో ఎలాంటి సినిమా రాలేదు. నేను ఇంకా త్రివిక్రమ్ గారిని కథ అడగలేదు, భారీగానే ఈ మూవీ ఉంటుందని " ఆయన మాటల్లో చెప్పుకొచ్చాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నాలుగోసారి ఈ కాంబినేషన్ రాబోతుండటంతో ఈ మూవీ పై మంచి అంచనాలే ఉంటాయి.

Advertisement

Next Story