రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల గుట్టు రట్టు!

by Vinod kumar |
రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల గుట్టు రట్టు!
X

దిశ, యాచారం: కల్తీ పాల గుట్టు రట్టును ఎస్ఓటీ ఎల్బీ నగర్ పోలీసులు బయటపెట్టారు. యాచారం సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన డిండి జంగారెడ్డి (46) కల్తీ పాలు తయారు చేస్తున్నారని తెలిపారు. పక్కా సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు జంగారెడ్డి ఇంట్లోకి నేరుగా వెళ్లి చూడగా కల్తీ పాలు తయారు చేయడానికి అవసరమైన వస్తువులు హైడ్రోజన్ పెరాక్సైడ్, గోల్డ్ డ్రాప్ ఆయిల్, మిల్క్ పౌడర్‌, 120 లీటర్ల కల్తీపాలను స్వాధీనం చేసుకున్నారన్నారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ లింగయ్య తెలిపారు.



Advertisement

Next Story

Most Viewed