- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Addanki Dayakar: వెంకటరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గిన అద్దంకి దయాకర్
దిశ, వెబ్‌డెస్క్: Addanki Dayakar Says Takes His Words back On Komatireddy Venkat Reddy| చండూర్ సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. వెంకట్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని, పొరపాటున నోరు జారానని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు వెంకట్ రెడ్డికి మీడియా పరంగా క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఈ విషయంలో పార్టీ డిసిప్లినరీ కమిటీ, ఏఐసీసీ, పీసీసీ రేవంత్ రెడ్డికి వివరణ ఇస్తానన్నారు. కాగా, శుక్రవారం మునుగోడు నియోజకవర్గం చండూర్ లో జరిగిన బహిరంగ సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కోమటిరెడ్డి అనుచరులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలోనూ తీవ్ర దుమారం రేపిన ఈ అంశంపై చివరకు అద్దంకి దయాకర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో 'హెచ్ఐవీ.. పోలీసులకు కంప్లైంట్