ఓకే చెప్పలేక.. కాదనలేక చచ్చిపోతున్నా.. యంగ్ బ్యూటీ

by Manoj |   ( Updated:2022-04-04 13:20:45.0  )
ఓకే చెప్పలేక.. కాదనలేక చచ్చిపోతున్నా.. యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి శర్వారి వాగ్.. డెబ్యూ మూవీ 'బంటీ ఔర్ బబ్లీ 2'తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలోనే అమీర్‌ఖాన్ కొడుకు జునైద్‌ఖాన్ ఫస్ట్ మూవీలో చాన్స్ వచ్చిందని, కానీ ఒప్పుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నట్లు చెప్పింది. అయితే ఇండస్ర్టీలో చాన్స్ దక్కించుకోవడం అనుకున్నంత సులభం కాదన్న శర్వారి.. మొదటి సినిమా కోసం లెక్కలేనన్ని ఆడిషన్స్‌కు హాజరైనట్లు గుర్తుచేసుకుంది. స్టార్ నటులతో పోటీపడేందుకు విభిన్న మార్గాలను ఎంచుకున్నప్పటికీ.. ర్యాంకుల పరంగా కొద్దిగా దురదృష్టం వెంటాడుతోందని పేర్కొంది. ఇక ఈ మధ్యే చారిత్రక నాటకాల వైపు ఆకర్షితమయ్యానని.. చరిత్ర, పురాణాల ప్రాముఖ్యత తెలిపే సినిమాలే చేయాలనుకుంటున్నానని తెలిపింది. ముఖ్యంగా స్త్రీలను యోధులుగా చిత్రీకరించే కొన్ని కథల్లో మహిళల తేజస్సు, గాంభీర్యం తనను అట్రాక్ట్ చేస్తుందని వివరించింది. కాగా ఈ బ్యూటీ విక్కీ కౌశల్ తమ్ముడు సన్నీ కౌశల్‌తో డేటింగ్ చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story